సొంత భవనంలోకి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
కామారెడ్డి రూరల్: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సొంత భవనంలోకి మారింది. కొన్ని సంవత్సరాల పాటు రిజిస్ట్రేషన్ కార్యాలయం కార్యకలపాలన్నీ బడాకసాబ్ గల్లీలోనే జరిగాయి. ఆ తర్వాత కామారెడ్డి పట్టణంలోని ఎన్‌జీవోఎస్ కాలనీలో గల అద్దె భవనంలోకి కార్యాలయం మారింది. భారీ స్థాయిలో ఆదాయం ఉన్నప్పటికీ కార్యాలయానికి సొంత భవనం లేకుండా పోయింది. ఎన్జీవోఎస్ కాలనీలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆ తర్వాత పాతరాజంపేట గ్రామ పంచాయతీ భవనంలోకి మారింది. ఈ కార్యాలయం పట్టణానికి చాలా దూరంలో ఉండటంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ఎట్టకేలకు అడ్లూర్ రోడ్డులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో నిర్మించిన నూతన భవనంలోకి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం మారింది. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్ కార్యకలాపాలన్నీ ఈ భవనంలోనే జరిగాయి.


