తల్లి గృహిణి.. తండ్రి రోజు కూలీ
● కుమారుడికి గ్రూప్–1 ఉద్యోగం
నిజాంసాగర్(జుక్కల్): రోజూ కూలీ పని చేస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితి ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన దంతుల శివకృష్ణ కష్టపడి చదివి తొలి ప్రయ్నతంలో గ్రూప్–1 ఉద్యోగం సాధించాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన దంతుల విజయలక్ష్మి, శంకర్ దంపతుల కుమారుడు శివకృష్ణ. శంకర్ సౌదీ దేశంలో కూలీ పని చేస్తుండగా విజయలక్ష్మి గృహణిగా ఉంది. అయితే తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసిన శివకృష్ణ హైద్రాబాద్‌లో ఉస్మానియా యునివర్సిటిలో పీజీ చేసి, గ్రూప్–1 కోర్సు చదివాడు. గ్రూప్ పరీక్ష ఫలితాల్లో 458.5 మార్కులతో స్టేట్ 428 ర్యాంకు సాధించి నిజాంసాగర్ ఎంపీడీవోగా వచ్చారు. తొలి ప్రయ్నతంలోనే గ్రూప్–1 ఉద్యోగం సాధించడం పట్ల శివకృష్ణ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్ ఎంపీడీవోగా దంతుల శివకృష్ణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.


