ఆర్మూర్‌లో పోలీసుల తనిఖీలు
ఆర్మూర్‌టౌన్: పట్టణంలో మంగళవారం రాత్రి నిషేధిత మాదక ద్రవ్యాలపై ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పాతబస్టాండ్‌లో ప్రయాణికుల బ్యాగులను, హోటల్స్‌లలో, పాన్‌షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్ధాల, ఇతర చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు శిక్షణ పొందిన స్నిఫర్ కుక్కల ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఎవరైన నిషేధిత మత్తు పదార్థలు వాడితే చర్యలు తప్పవన్నారు.
నవీపేట: మద్యం తాగి న్యూసెన్స్ చేసిన ఒకరికి జిల్లాకోర్టు వారంరోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. వివరాలు ఇలా.. నవీపేట శివారులో ఇటీవల పోలీసులు డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మానవత్ కృష్ణ అనే రౌడీషీటర్ మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడటంతో న్యూసెన్స్ చేశాడు. దీంతో అతడిపై కేసు నమోదుచేసి మంగళవారం కోర్టులో హాజరుపర్చారు. జడ్జి విచారణ జరిపి అతడికి వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
డిచ్‌పల్లి: మండలంలోని నడిపల్లి శివారులో పండ్ల లోడ్‌తో వెళుతున్న మినీ ట్రక్కు బోల్తాపడింది. వివరాలు ఇలా.. ఉన్నాయి.. నారింజ పండ్ల లోడుతో మినీ ట్రక్కు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. సోమవా రం అర్ధరాత్రి ట్రక్కు మండలంలోని నడిపల్లి శివారులోని పెట్రోల్ బంకు సమీపంలోకి రాగానే ముందు టైరు పేలి ఒక్కసారిగా పల్టీలు కొట్టి రోడ్డు కిందకు దూసుకుపోయింది. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. మంగళవారం ఉదయాన్నే సంబంధిత వ్యక్తులు ఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడిన ట్రక్కు నుంచి పండ్లను మరో వాహనంలోకి మార్చారు. క్రేన్ సాయంతో బోల్తా పడిన ట్రక్కును తరలించారు. ఈవిషయమై డిచ్‌పల్లి ఎస్సై ఎండీ షరీఫ్‌ను సంప్రదించగా ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఫిర్యాదు రాలేదని తెలిపారు.
ఆర్మూర్‌లో పోలీసుల తనిఖీలు


