చట్టాలు ప్రజలకు నేస్తాలు
నిజామాబాద్ లీగల్: శాసన వ్యవస్థలు చేసే చట్టాలు, ప్రజలకు నేస్తాలుగా నిలుస్తాయని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు అన్నారు. నగరంలోని ‘వర్డ్‘ (వుమెన్ ఆర్గనైజేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్) స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పని చేస్తున్న వారికి ప్రజా సమస్యలు తెలుస్తాయని, వాటిలో ఎక్కువ శాతం చట్టం పరిధిలో పరిష్కరించే అవకాశలే ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, వర్డ్ సిబ్బంది రాణి, కిరణ్మయి, విజయ్,ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.
వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్ లీగల్: నగరంలోని జిల్లా న్యాయసేవ సంస్థ కార్యాలయంలో మంగళవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘చెకుముకి సైన్స్ సంబురాలు–2025’ వాల్‌పోస్టర్లను జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ఉదయ భాస్కర్ రావు ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. వేదిక కార్యదర్శి పులి జైపాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రయివేట్ బడుల్లోని 8, 9, 10వ తరగతి విద్యార్థులకు నవంబర్ 7న పాఠశాల స్థాయిలో, నవంబర్ 21న మండల స్థాయిలో, 28న జిల్లా స్థాయిల్లో సైన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వేదిక ప్రతినిధులు ఖాజా ఉమర్ అలీ, బాస రాజేశ్వర్, శ్రీహరి ఆచార్య, కరిగె పండరి, న్యాయవాదులు అశోక్, ప్రదీప్, కిరణ్,మల్లాని శివకుమార్ పాల్గొన్నారు.
చట్టాలు ప్రజలకు నేస్తాలు


