నాణ్యతతో మిషన్ భగీరథ సంపును నిర్మించాలి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): నాణ్యతతో మిషన్ భగీరథ సంపును నిర్మించాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూం కాలనీలో మిషన్ భగీరథ సంపు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ నిధుల కింద రూ.33 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. దీంతో స్థానికులకు మంచినీరు అందుతుందని తెలిపారు. మిషన్ భగీరథ ఏఈ రాచప్ప, తహసీల్దార్ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, నాయకులు మోహన్, నాగిరెడ్డి, మల్లప్ప పటేల్ పాల్గొన్నారు.
పౌష్టికాహారంతోనే బలమైన సమాజ నిర్మాణం
పౌష్టికాహారంతోనే బలమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని పాపహరేశ్వర ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలకు 40 టాయిలెట్స్ మంజూరయ్యాయని త్వరలోనే వాటి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.


