దళిత సంఘాల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

దళిత సంఘాల ఆందోళన

Oct 28 2025 8:14 AM | Updated on Oct 28 2025 8:14 AM

దళిత

దళిత సంఘాల ఆందోళన

దళిత సంఘాల ఆందోళన ‘చలో ఢిల్లీ’ విజయవంతం చేయాలి ‘ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నా’

మాచారెడ్డి: పాల్వంచ మండలం ఫరీదుపేటలో ఓ దళిత మహిళపై స్థానిక రైస్‌ మిల్లులో పనిచేసే కూలీ అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితురాలికి న్యాయం చేయాలని దళిత సంఘాల నాయకులు రైస్‌ మిల్‌ ఎదుట సోమవారం ఆందోళన చేశారు. పరారీలో ఉన్న నిందితుడ్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న వాళ్లను పనుల్లో పెట్టుకోవద్దని రైస్‌ మిల్లర్కు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి రూరల్‌ సీఐ రామన్‌ పోలీస్‌ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులను సముదాయించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

మాచారెడ్డి: ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 1న నిర్వహించనున్న చలో డిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు బట్ట రమేష్‌ కోరారు. సోమవారం చుక్కాపూర్లో ఆయన మాట్లాడారు. సుప్రీం కోర్టు జడ్జి గవాయ్పై దాడి చేసిన అడ్వకేట్ను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు హరీష్‌, విజయ్‌, రాజశేఖర్‌, నాగరాజు, శేఖర్‌, బాల్‌ రాజు, విగ్నేష్‌, మహేష్‌ ఉన్నారు.

తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాడ్వాయి సింగిల్‌ విండో ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నాని సింగిల్‌ విండో ప్రత్యేక అధికారి లక్ష్మణ్‌ అన్నారు. తాడ్వాయి సింగిల్‌విండో కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. చైర్మన్‌గా ఉన్న కపిల్‌రెడ్డి పదవీకాలం ముగిసిందని, ప్రస్తుతం ఆయన పదవీలో లేరన్నారు. ఆయన దీనిపై కోర్టుకు వెళ్లాడని అది పెండింగ్‌లో ఉందన్నారు. చైర్మన్‌, ఇద్దరు డైరెక్టర్లు సొసైటీ కొంత డబ్బును వాడుకున్నారు. కపిల్‌ అధ్యక్షుడిగా సాగాలని డీసీవో ఎలాంటి ఆర్డర్‌ ఇవ్వలేదన్నారు. అధికారుల ఆదేశాల మేరకే తాడ్వాయి మండలంలో మక్కల కొనుగోలు కేంద్రాలను ప్రాంభించామన్నారు. అధికారి విఠల్‌, సీఈవో నర్సిములు, సిబ్బంది ఉన్నారు.

దళిత సంఘాల ఆందోళన 1
1/2

దళిత సంఘాల ఆందోళన

దళిత సంఘాల ఆందోళన 2
2/2

దళిత సంఘాల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement