ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 106 వినతులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవా రం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 106 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్‌లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్ చందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


