మూడేళ్లయినా పూర్తికాలే!
వాగు బాగా పారింది
పూర్తయ్యేలా చూడాలి
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలంలోని సింగితం గ్రామ శివారులో వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణానికి 2023లో రూ. 4.8 కోట్లు మంజూరు అయ్యాయి. వాగుపై వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి మూడేళ్లు కావస్తున్నా పనులు మాత్రం పూర్తికాక, నిర్మాణం ముందుకు సాగకపోవడంతో నిలిచాయి. వంతెన పనులు ప్రారంభమైనప్పుడు ఆయకట్టు ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేశారు. వాగు మధ్యలో పిల్లర్లను నిర్మించి పనులు నిలిపివేశారు. వంతెన నిర్మాణానికి నిధులు ఉన్నా నిర్మాణ పనుల్లో పురోగతి లేదు. హైలెవల్ వంతెన నిర్మాణ పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారా జ్యంగా పనులు చేపడుతున్నారు. గతేడాది కాలం నుంచి సదరు వంతెన నిర్మాణ పనుల ముందుకు సాగడం లేదు.
వాగు దాటడం ప్రాణం సంకటం
సింగితం వాగు అవతల ఉన్న చెరువుల కింద 280 ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. ఆయా చెరువుల కింద పంటలు సాగు చేయాలంటే వాగులో వరద నీటిని దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వర్షాకాలంలో వాగు దాటడం ప్రాణం సంకటంగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈఏడాది వర్షాకాలం ఆరంభం నుంచి వర్షాలు దంచికొట్టడంతో వాగు అవతల భూములు పంటల సాగుకు నోచుకోక బీళ్లుగా ఉన్నాయి. దీంతో ఆయకట్టు ప్రాంత రైతులు పంటలు సాగు చేయక లక్షల రుపాయలు నష్టపోయారు.
ఈఏడాది వర్షాలు దంచికొట్టడంతో మునుపెన్నడు లేనంతగా వాగు పారింది. పంటలు వేద్దామంటే వాగు అడ్డంగా ఉంది. వాగు మీద బ్రిడ్జి నిర్మిస్తే పంటలు సాగు చేయడం సులువుగా ఉంటుంది. ఏడాదిన్నర నుంచి వాగు పనుల జాడ లేదు.
– దుర్గం లక్ష్మయ్య, రైతు, సింగితం
మా తాత, ముత్తాల సంది సింగితం వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని అడుగుతున్నాం. ఎన్నో ఎండ్ల సంది అడుగుతుంటే సింగితం వా గుపై వంతెన నిర్మాణానికి నిధులు వచ్చాయి. వంతెన నిర్మాణ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. వాగు దాటి సాగు చేయకపోవడంతో భూములు బీళ్లుగా ఉన్నాయి. సార్లు ఇప్పడైన వంతెన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
– పద్మ గంగారాం, రైతు సింగితం
సింగితం గ్రామ శివారులో వాగుపై
నిలిచిన హైలెవల్ వంతెన నిర్మాణ పనులు
వాగుదాటే పరిస్థితి లేక సాగుకు నోచుకోని భూములు
పట్టించుకోని అధికారులు
మూడేళ్లయినా పూర్తికాలే!
మూడేళ్లయినా పూర్తికాలే!
మూడేళ్లయినా పూర్తికాలే!


