కుక్కల బెడద
● లింగంపేట మండలంలో
భయాందోళనకు గురవుతున్న ప్రజలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కుక్కల బెడద రోజు రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీధి కుక్కలు రాత్రింబవళ్లు రోడ్లపై తిరుగుతూ వాహనదారుల వెంటబడుతున్నాయి. దీంతో వాహనదారులు అదుపు తప్పి కింద పడి గాయాలపాలవుతున్నారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ అధికారులు కుక్కల బెడదను నివారించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


