గాంధారి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు
● పలు చోట్ల అభివృద్ధి పనులకు
శంకుస్థాపన
గాంధారి(ఎల్లారెడ్డి): నియోజకవర్గంలో గాంధారి మండల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు అన్నారు. ఆదివారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా గాంధారి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నూతన కంప్యూటర్ ల్యాబ్‌ను, నూతనంగా నిర్మించిన మరుగుదొడ్లను ప్రారంభించారు. దుర్గానగర్ కాలనీలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మించిన ఇందిరమ్మ నమూనా ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మండలంలో అన్ని గ్రామాల సమగ్రాభివృద్దికి కావాల్సిన నిధులను మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను సన్మానించిన
మండల కాంగ్రెస్ నాయకులు
రాజంపేట : స్థానిక ఎన్నికలలో పోటీచేసేందుకు ఇద్దరి పిల్లల నిబంధనను ఎత్తివేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపినందుకుగాను ఎల్లారెడ్డి నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావును శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయడానికి ఇద్దరు పిల్లలు నిబంధన విషయాన్ని పలుమార్లు ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ రాజంపేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రణీత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సల్మాన్ తదితరులున్నారు.


