ఊపందుకున్న వరికోతలు
లింగంపేట/బాన్సువాడ రూరల్ : లింగంపేట మండలంలోని ఆయా గ్రామాల్లో వరి కోతలు ఊపందుకున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో భారీ వర్షాల కారణంగా ధాన్యం దిగుబడి తక్కువగా వస్తున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరి కోతలకు చైన్ హార్వెస్టర్ యంత్రానికి గంటకు రూ. 2600, టైర్ హార్వెస్టర్ యంత్రానికి గంటకు రూ. 2000 తీసుకుంటున్నట్లు రైతులు పేర్కొన్నారు. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్లు ధాన్యం దిగుబడి వస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 30 నుంచి 35 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వచ్చినట్లు తెలిపారు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ మండలంలోని బోర్లం, ఇబ్రహీంపేట్, పోచారం, రాంపూర్, దేశాయిపేట్, సోమేశ్వర్ గ్రామ శివార్లలో వరికోతలు జోరుగా సాగుతున్నాయి. రైతులు నూర్పిడీ చేసిన ధాన్యాన్ని రోడ్లపై పోసి ఆరబెడ్తుండటంతో వాహనచోదకులు ఇబ్బంది పడ్తున్నారు.
ఊపందుకున్న వరికోతలు


