కల్లుగీత మహాసభలను విజయవంతం చేయాలి
దోమకొండ: కల్లుగీత కార్మిక సంఘం జిల్లా, రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆసంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్ కోరారు. ఈసభకు సంబంధించిన మహాసభల కరపత్రాలను ఆదివారం మండలకేంద్రంలో గీతకార్మికులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడి 68 సంవత్సరాలు అవుతుందన్నారు. 1957లో ధర్మాబిక్షం దాట్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంఘం దొరలను భూస్వాములను ఎదిరించి హర్రాజు మామ్లాలను రద్దు చేయించుకున్నామన్నారు. సొసైటీలను ఏర్పాటు చేసుకొని అనేక హక్కులను సాధించుకున్నామని పేర్కొన్నారు. నవంబర్ 11 న కామారెడ్డిలో జిల్లా మహాసభ ఉంటుందని, నవంబర్ 28, 29,30 తేదీల్లో రాష్ట్ర మహాసభలు సూర్యాపేటలో ఉంటాయని, ఈమహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహా సభలో కల్లు గీత వృత్తి రక్షణ కోసం పలుతీర్మానాలు ఆమోదిస్తామని పేర్కొన్నారు. కల్లుగీత వృత్తిని రక్షించాలంటే మద్యం తగ్గించి స్వచ్ఛమైన కల్లును ప్రజలకు అందించే విధంగా అధునికీకరణ చేపట్టాలని, మార్కెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజనర్సాగౌడ్, నాయకులు రాజాగౌడ్, రాజెందర్‌గౌడ్ , వెంకట్ గౌడ్, యాదగిరి గౌడ్, సిద్దార్థ్‌గౌడ్, నరేష్‌గౌడ్, సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


