● ఫంక్షన్లు, పెళ్లిళ్ల్లకు వెళితే వెంట తీసుకెళతారు ● వ
జంగంపల్లికి చెందిన చెన్నప్పగారి మోహన్‌రెడ్డి తన కూతురుతో కలిసి స్టీల్ ప్లేట్‌లో తింటున్న దృశ్యం.. పేపర్‌ప్లేట్లలో తింటున్న మిగతావారు (ఫైల్)
ఎంత పెద్ద ఫంక్షన్ చేసినా గిన్నేగిలాస(స్టీల్ ప్లేట్, గ్లాస్) శబ్దం వినిపించడం లేదు. ఇప్పుడంతా ఇన్‌స్టాంట్, డిస్పోజబుల్. ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా ప్రమాదకర రసాయనాలు కలిపి తయారు చేసే పేపర్ ప్లేట్లు, గ్లాస్‌లు ఉపయోగిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా ‘శ్రమ’ ఉండదనే షార్ట్‌కట్ దారి భయం అనేది లేకుండా చేస్తోంది. అంతా డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాస్‌లు వాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా తమ వెంట స్టీల్ ప్లేట్, గ్లాస్‌లు తీసుకెళ్తూ వాటిలో భోజనం చేసి కడిగేసి బ్యాగుల్లో పెట్టుకుంటున్నారు. డిస్పోజబుల్ భూతంతో పొంచి ఉన్న ప్రమాదంపై వీరు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఫంక్షన్‌లలో అవగాహన కల్పిస్తున్నారు.
తన వెంట తెచ్చుకున్న స్టీల్ ప్లేటులో భోజనం చేస్తున్న మద్నూర్‌కు చెందిన
అరవింద్ (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పెళ్లి, ఫంక్షన్, పండగ, అన్నదానాలు... ఆఖరుకు ఇంట్లో చేసుకునే చిన్నచిన్న దావత్‌లలో కూడా భోజనాలకు పేపర్ ప్లేట్లు, అట్ట ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్న రోజులివి. పేపర్ ప్లేట్ల మీద ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది. వేడివేడి అన్నం, కూరలు వేసుకున్నపుడు ప్లాస్టిక్ కరిగిపోతుందని, తినే ఆహారంతోపాటు కడుపులోకి వెళుతుందని మనందరికీ తెలుసు. అయినా వాటినే వాడుతుంటాం. అయితే ప్లాస్టిక్, పేపర్ ప్లేట్ల వల్ల కలిగే అనర్థాలను అర్థం చేసుకున్న కొందరు వాటికి దూరంగా ఉంటున్నారు. ఫంక్షన్‌లలో, పెళ్లిళ్లలో స్టీల్ ప్లేట్లు ఉంటేనే భోజనం చేస్తున్నారు. అందుకే ఎక్కడికి వెళ్లినా తమ వెంట స్టీల్ ప్లేటు, గ్లాసులు ఉంచుకోవడం అలవాటు చేసుకున్నారు. పలువురు పేపర్ ప్లేట్లు, అట్ట ప్లేట్లను వదిలేసి స్టీల్ ప్లేట్ల భోజనానికే ప్రాధాన్యతనిస్తున్నారు. ఫంక్షన్లు, పెళ్లిళ్లలో స్టీల్ ప్లేట్లు కడగడానికి డబ్బులు ఖర్చయినా సరే పనిమనుషులను పెడుతున్నారు.
ఇంకొందరు ఇళ్లల్లో జరిగే చిన్నచిన్న ఫంక్షన్‌లకు సరిపడా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు కొనుగోలు చేసి ఇళ్లలో ఉంచుకుంటున్నారు. ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు అవసరమైతే వాటిని ఇస్తున్నారు.
● ఫంక్షన్లు, పెళ్లిళ్ల్లకు వెళితే వెంట తీసుకెళతారు ● వ


