పేపర్ ప్లేట్లలో తినేది లేదు..
భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన చెన్నప్పగారి మోహన్‌రెడ్డి కుటుంబం స్టీల్ ప్లేట్లనే వాడుతోంది. ఆయన భార్య పావని, పిల్లలు సహన, సహజలు ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు వెళ్లినపుడు వెంట ఓ బ్యాగులో స్టీల్ ప్లేట్లు తీసుకుని వెళ్తారు. అక్కడ స్టీల్ ప్లేట్లలో భోజనం ఉంటే వాటిలో తింటారు. లేదంటే తమ వెంట తెచ్చుకున్న స్టీల్ ప్లేట్లను బయటికి తీసి అందులో తిని, కడిగేసుకుని వెళ్తారు. ఏదైనా పరిస్థితుల్లో ప్లేట్ వెంట లేకుంటే తినకుండా ఉంటారు తప్ప, పేపర్, అట్ట ప్లేట్లలో మాత్రం తినేది లేదని మోహన్‌రెడ్డి ‘సాక్షి’తో తెలిపారు.


