బోనస్‌ చెల్లింపు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బోనస్‌ చెల్లింపు ప్రారంభం

Oct 26 2025 8:37 AM | Updated on Oct 26 2025 8:37 AM

బోనస్

బోనస్‌ చెల్లింపు ప్రారంభం

కామారెడ్డి క్రైం: రైతులకు ఖరీఫ్‌ ధాన్యానికి సంబంధించిన బోనస్‌ చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైందని సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ డీఎం శ్రీకాంత్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ ఎంట్రీ, మొత్తం ప్రాసెస్‌ పూర్తయిన జిల్లాలోని ముగ్గురు రైతుల ఖాతాల్లో శనివారం రూ.2.69 లక్షలు జమయ్యాయని వెల్లడించారు. మిగతా రైతులకు కూడా ధాన్యం సేకరణ, ఆన్‌లైన్‌ ప్రక్రియ మొత్తం పూర్తి కాగానే బోసన్‌ డబ్బులు జమవుతాయని పేర్కొన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే యాసంగి సీజన్‌కు సంబంధించి రూ.89 కోట్ల బోనస్‌ చెల్లింపు పెండింగ్‌లోనే ఉంది.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో

రైతుల సంబరాలు

జిల్లాలోనే మొదటగా 48గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు

జమకావడంపై హర్షం

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ధ ర్మారెడ్డి గ్రామశివారులో మహిళాసంఘం ఆ ధ్వర్యంలో ఈఏడాది వానాకాలం సీజన్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన కొనుగోలుకేంద్రంలో సేకరించిన ధాన్యం డబ్బులు జిల్లాలోనే మొదటగా 48గంటల్లో రైతుల ఖాతా ల్లో జమయ్యాయి. దీంతో శనివారం రైతు లు, మహిళాసంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ..కొనుగోలుకేంద్రంలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కొనుగోలు కేంద్రంలో 11మంది రైతుల నుంచి 528.80క్వింటాళ్ల ధాన్యం సేకరించినట్లు ఏ పీఎం రాంనారాయణగౌడ్‌ తెలిపారు. ఈ మే రకు సంబంధిత రైతుల ఖాతాల్లో రూ.12లక్షల63వేల303 జమైనట్లు ఆయన చెప్పారు.

రైతులకు ఇబ్బందులు కలగకుండా

చర్యలు తీసుకోవాలి

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

కామారెడ్డిక్రైం: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలను తీసుకోవాలని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 11,931 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇందులో 11,201 మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లులకు తరలించామన్నారు. సంబంధిత శాఖల అధికారులు నిరంతరంగా కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు.ఎప్పటికప్పుడు ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించాలన్నారు. ఈసమావేశంలో అదనపు కలెక్టర్‌ విక్టర్‌ అధికారులు పాల్గొన్నారు.

4.25 లక్షల

చేపపిల్లలు సిద్ధం

నిజాంసాగర్‌(జుక్కల్‌): మండలంలోని అచ్చంపేట చేప పిల్లల విత్తనోత్పత్తి కేంద్రంలోని రెండు నర్సరీల్లో 4.25 లక్షల చేప పిల్లలు పంపిణీ సిద్ధంగా ఉన్నాయి. స్థానిక చెరువుల్లో నుంచి తల్లి చేపలను తీసుకొచ్చి కట్ల, రహు రకాల చేప పిల్లలను ఉత్పత్తి చేశారు. దాదాపు రెండు ననెలలుగా చేపపిల్లల ఉత్పత్తి చేపడుతుండగా ప్రస్తుతం 35 నుంచి 40ఎంఎం సైజ్‌కు చేరుకున్నాయి. ప్రభుత్వ నుంచి ఆదేశాలు వెలువడగానే చేప పిల్లలను స్థానిక చెరువులు, కుంటల్లో విడుదల చేస్తామని మత్య్సశాఖ ఎఫ్‌డీవో డోలిసింగ్‌ తెలిపారు.

ఆలయాల సందర్శనకు ఆర్టీసీ బస్సులు

కామారెడ్డి టౌన్‌: కార్తీక మాసం సందర్భంగా ప్రముఖ ఆలయాల సందర్శనకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తామని కామారెడ్డి డిపో మేనేజర్‌ దినేష్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ శైవ క్షేత్రాలు అరుణాచలం, శ్రీశైలం, రామప్ప, కాళేశ్వరం, ఉజ్జయిని, మహాకాళేశ్వర్‌, ఓంకారేశ్వర్‌ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకోడానికి డిపో నుంచి డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సులను అద్దెకు ఇస్తామన్నారు. వివరాలు, బుకింగ్‌ కోసం 9959226018, 7382851280, 7382843783 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

బోనస్‌ చెల్లింపు ప్రారంభం 
1
1/2

బోనస్‌ చెల్లింపు ప్రారంభం

బోనస్‌ చెల్లింపు ప్రారంభం 
2
2/2

బోనస్‌ చెల్లింపు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement