స్మరిస్తూ.. సైకిల్ ర్యాలీ
పట్టణంలో ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ, ఏఎస్పీ, పోలీసులు
కామారెడ్డి క్రైం: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో భారీ సైకిల్ ర్యాలీ చేపట్టారు. నర్సన్నపల్లి బైపాస్‌లో ర్యాలీని ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్య రెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. అక్కడ నుంచి పట్టణం లోని ఇందిరాగాంధీ స్టేడియం వరకు ర్యాలీ కొనసాగింది. పోలీసు అమర వీరులకు జోహార్లు తెలుపుతూ ప్రధాన రహదారి వెంబడి పోలీసుల సైకిల్ ర్యాలీ ఉత్సా హంగా సాగింది.
ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి, ఏఎస్పీ చైతన్యరెడ్డిలు సైకిల్ ర్యాలీలో పా ల్గొని మిగతావారిని ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..అమర వీరుల త్యాగాలు మరువలేవన్నారు. వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. 300 మంది పోలీసులు, కళాశాలల విద్యార్థులు, యువకులు ర్యాలీలో పాల్గొన్నారు.


