ఎక్కడికి వెళ్లినా..
దోమకొండకు చెందిన మోహన్‌రెడ్డి, సురేఖ దంపతులు ఫంక్షన్లు, పెళ్లిళ్లతోపాటు దేవాలయాల వ ద్ద జరిగే ఉత్సవాలకు వె ళ్లినపుడు భోజనం చేయడానికి వెంట స్టీల్ ప్లేట్లు తీసుకువెళ్తారు. అక్కడ స్టీల్ ప్లేట్లు ఉంటే వాటిలో తింటారు. లేదంటే తమ వెంట తీసుకువెళ్లిన ప్లేట్లలో తినేసి శు భ్రంగా కడుక్కుని బ్యాగులో పెట్టేసుకుంటారు.
అలాగే మద్నూర్‌కు చెందిన తమ్మేవార్ అరవింద్, సోనాలి దంపతులు ఎక్కడికి వెళ్లినా తమ వెంట స్టీల్ ప్లేట్లు తీసుకువెళ్తారు. వారికి హైదరాబాద్, ముంబై, ఔరంగాబాద్, పూణే వంటి ప్రాంతాల్లో బంధువులు ఉన్నారు. అక్కడికి వెళ్లినా వారివెంట స్టీల్ ప్లేట్లు ఉంటాయి. అందరూ పేపర్, అట్ట ప్లేట్లలో తింటుంటే వీళ్లు మాత్రం స్టీల్ ప్లేట్లలో తింటారు.


