శభాష్‌రెడ్డి..
● దీనార్తుల సొంతింటి కలను నెరవేర్చిన వ్యాపారవేత్త సుభాష్‌రెడ్డి
● దోమకొండ, బీబీపేటలో మొత్తం
ఐదు ఇళ్ల నిర్మాణం
బీబీపేట/దోమకొండ : ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. నేనున్నానంటూ దీనార్తులకు భరోసా కల్పించి వారి సొంతింటి కలను నెరవేర్చారు. బీబీపేట మండలం మాందాపూర్‌లో గతేడాది చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో నాలుగు ఇళ్లు పూర్తిగా దగ్ధం కావడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అలాగే దోమకొండ మండల కేంద్రానికి చెందిన దివ్యాంగులైన అక్కాచెల్లెళ్లు కమ్మరి లక్ష్మి, కమ్మరి రాజేశ్వరికి తల్లిదండ్రులు లేరు. శిథిలావస్థలో ఉన్న పెంకుటింట్లో ఉంటున్నారు. వారి పరిస్థితిని తెలుసుకున్న సుభాష్‌రెడ్డి ఇళ్లను నిర్మించి శనివారం గృహప్రవేశం చేయించారు. దీనార్తులకు అండగా నిలిచిన సుభాష్‌రెడ్డిని ఆయా గ్రామాల ప్రజలు అభినందించారు.
శభాష్‌రెడ్డి..


