పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
బాన్సువాడ : పోషకాహార లోపం ఉన్న పిల్లలను గు ర్తించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయడ మే షోషణ మాస లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసా య సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ రెడ్డి సంఘంలో నిర్వహించిన పోషక మాసం కార్యక్రమానికి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్‌తో కలిసి పోచారం హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక కుటుంబం ఆరోగ్యంగా ముందుకు వెళ్లాంటే కు టుంబంలోని మహిళ పాత్ర ప్రత్యేకమని అన్నారు. గర్భిణుల పోషణ స్థితిని మెరుగుపర్చాలని, అప్పు డే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నా రు. రక్తహీనత సమస్య తలెత్తకుండా మహిళలు పౌ ష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అనంత రం గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. రెడ్డి సంఘం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పో చారం పరిశీలించారు. పీడీ ప్రమీల, సూపరింటెండెంట్ అరుణ్‌భాస్కర్, సీడీపీవో సౌభా గ్య, కాంగ్రెస్ నాయకులు జంగం గంగాధర్, పిట్ల శ్రీధర్, నార్ల సురేశ్, ఎజాస్, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.


