హడలెత్తిస్తున్న వాన
సదాశివనగర్/నిజాంసాగర్/పిట్లం : జిల్లాలోని పలు మండలాల్లో శనివారం మధ్యాహ్నం వర్షం కురవడంతో ధాన్యం ఆరబోసిన రైతులు ఇబ్బందులు పడ్డారు. సదాశివనగర్ మండల కేంద్రంతోపాటు తిర్మన్‌పల్లి, మర్కల్, కుప్రియాల్, ధర్మారావ్‌పేట్ తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోయింది. నిజాంసాగర్, జుక్కల్ మండలాల్లో వర్షం కురవడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
సదాశివనగర్ మండలం మోడెగాంలో వర్షానికి కొట్టుకు పోయిన వడ్లు


