సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
కామారెడ్డి టౌన్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుందని స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్‌టీయూటీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానంద్‌గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ పెండింగ్ డీఏలు, పదవివిరమణ ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులలో 2010 కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాలకు సిద్దమవుతామని హెచ్చరించారు.
నూతన జిల్లా కమిటీ ఎన్నిక
ఎస్‌టీయూటీఎస్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కుంట రాములు, ప్రధాన కార్యదర్శిగా పంపరి ప్రవీణ్‌కుమార్, అసోసియేట్ అధ్యక్షుడిగా సయ్యద్ ఖలీమోద్దిన్, ఉపాధ్యక్షులుగా పందిరి రాజేష్, రిజ్వానా ఆఫ్రిన్, కార్యదర్శిగా రాజు, రఫల్ సుల్తానా, ఆర్థిక కార్యదర్శిగా శ్రీనివాస్, రాజేందర్, రాష్ట్ర కౌన్సిలర్‌గా దయానంద్‌లను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో సాబేర్ అలీ, గజేందర్, మండలాల నాయకులు పాల్గొన్నారు.


