అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులేరి?
మద్నూర్(జుక్కల్): మద్నూర్, డోంగ్లీ మండలాల్లోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు లేక బోసిపోతున్నాయి. ప్రతి సెంటర్‌లలో 20 నుంచి 30 మంది పిల్లలు ఉండగా ఇద్దరు లేదా ముగ్గరు కంటే ఎక్కువ చిన్నారులు కనబడటం లేదు. మద్నూర్ మండలంలోని సోనాల, తడిహిప్పర్గా, డోంగ్లీ మండలంలోని లింబుర్, డోంగ్లీలోని అంగన్‌వాడీ కేంద్రాలకు శనివారం చిన్నారులు రాలేదు. డోంగ్లీ మండల కేంద్రంలోని మొదటి సెంటర్‌లో ఒక్కరు రాకపోవడంతో టీచర్ ఒక్కరే ఉన్నారు. చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి కేంద్రాలకు పంపించేలా చూడాల్సిన బాధ్యతను, అంగన్‌వాడీ కేంద్రాలను పర్యవేక్షించి సరుకులు ఉన్నాయా .. పిల్లలు వస్తున్నారా.. కేంద్రాల్లో మెనూ అమలు చేస్తున్నారా అని పర్యవేక్షించాల్సిన ఐసీడీఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.


