సమయపాలన పాటించని అంగన్‌వాడీ టీచర్లు
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని భద్రాల్ తండా అంగన్‌వాడీ స్కూల్‌లో టీచర్, ఆయమ్మ సమయపాలన పాటించడం లేదని తండావాసులు ఆరోపిస్తున్నారు. శనివారం తండావాసులు సెంటర్‌కు వెళ్లగా మధ్యాహ్నం మూడు గంటలకు తాళం వేసి వెళ్లిపోయారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు కేంద్రం తెరిచి. సాయంత్రం 4 గంటల వరకు ఉంచాలన్నారు. అలాకాకుండా ఉదయం, సాయంత్రం సెంటర్ సమయపాలన పాటించడం లేదన్నారు. ఫిర్యాదు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని తండా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్ మండల సుపర్‌వైజర్ వినోద ఇన్‌చార్జి సూపర్‌వైజర్‌గా ఉన్నారని, సెంటర్ నిర్వహణపై దృష్టిసారించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.


