కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటా
కామారెడ్డి టౌన్: కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శనివారం టేక్రియాల్‌లో ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. టేక్రియాల్‌లో నందివాడ సాయిలు, సుంకరి సాయిలు, రాయల సాయి కుటుంబాలను పరామర్శించారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న, చెవిటి భాస్కర్, సుంకరి బిందులతో మాట్లాడారు. ఈ ఐడు కుటుంబాలకు రూ. 10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు.
ఆలయానికి రూ. 50వేల విరాళం
టేక్రియాల్‌లోని హనుమాన్ ఆలయ పునర్నిర్మాణ పనులకు రూ. 50వేల విరాళాన్ని అందజేశారు. కా ర్యక్రమంలో నాయకులు శంకర్‌రావు, రవి, శ్రీనివా స్, సుధాకర్, సాయిబాబా, సలీం, వంశీ, రమేష్, ఆంజనేయులు, తదితరులున్నారు.


