ప్లాస్టిక్ వాడకం, క్యాన్సర్‌కు కారకం
● ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
● ఎల్లారెడ్డిలో స్వచ్ఛత ర్యాలీ
ఎల్లారెడ్డి: ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్‌కు కారకమవుతుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. శనివారం ఎల్లారెడ్డిలో మున్సిపల్ ఆధ్వర్యంలో స్వచ్ఛర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బస్టాండ్‌లో వసతులను బస్సులోని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ ఆవరణలో టాయిలెట్లు శుభ్రంగా ఉండేలా చూడాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. అనంతరం మార్కెట్‌లో గాజు గ్లాసులో టీ విక్రయిస్తున్న నిర్వాహకులు ఇస్మాయిల్‌ను శాలువాతో సన్మానించి, గాజు గ్లాసులో టీ తాగారు. కూరగాయల మార్కెట్‌కు జూట్ బ్యాగులతో వచ్చిన వారికి, మటన్ మార్కెట్‌కు టిఫిన్ బాక్సులను తీసుకుని వచ్చిన వారికి శాలువాతో సన్మానించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తినే పదార్ధాలు ప్లాస్టిక్ కవర్లలో తీసుకుని వెళ్లడంతో టీని ప్లాస్టిక్ గ్లాసులలో తాగడంతో క్యాన్సర్ కారక కణాలు శరీరంలో వృద్ధి చెందుతాయన్నారు. దీంతో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పార్థసింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేష్‌కుమార్, ఏఎంసీ చైర్ పర్సన్ రజిత, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మెన్లు కుడుముల సత్యనారాయణ, పద్మశ్రీకాంత్, మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా, వినోద్‌గౌడ్, కాంగ్రెస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఆరీఫ్, విద్యాసాగర్, శ్రీనివాస్, తిరుపతి తదితరులున్నారు.
కాంగ్రెస్ పార్టీ సోషల్‌మీడియా
కోఆర్డినేటర్‌గా మహేందర్
ఎల్లారెడ్డిరూరల్:ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నిజ్జన మహేందర్‌ను నియమించినట్లు కాంగ్రెస్ నాయకులు శనివారం తెలిపారు. సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నియామక పత్రాన్ని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు శనివారం మహేందర్‌కు అందించినట్లు వారు తెలిపారు.
అన్ని గ్రామాల అభివృద్ధే ధ్యేయం
గాంధారి(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అన్ని సదుపాయాలు ఉండేలా సమగ్ర అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించారు.హేమ్లానాయక్ తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి, ఎక్కకుంట తండాలో నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి, సర్వాపూర్, పిష్కిల్ గుట్ట తండాలో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. పేట్‌సంగెం, గుర్జాల్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన సహకార సంఘం గోడౌన్‌లను, పోతంగల్ కలాన్‌లో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ముదెల్లి, సీతాయిపల్లి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


