జీవ వైవిధ్యంతోనే పర్యావరణ పరిరక్షణ
కామారెడ్డి అర్బన్: జీవ వైవిధ్యంతోనే పర్యావరణ పరిరక్షణ జరుతుందని, జీవజాతులను పరిరక్షించడం ప్రతి పౌరుని బాధ్యత అని కామారెడ్డి డివిజనల్ అటవీ అధికారి రామకృష్ణ అన్నారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వృక్షశాస్త్రం, ఫారెస్టీ విభాగం విద్యార్థులు 85 మంది, అధ్యాపకులు అటవీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని మంచిప్ప అటవీప్రాంతాన్ని సందర్శించారు. అడవి జంతువుల జీవన విధానాన్ని, సంరక్షణను ప్రజలకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. అటవీశాఖలో ఉద్యోగులు, వారి హోదాలు, భవిష్యత్‌లో ఉద్యోగ అవకాశాలను వివరించారు. ప్రిన్సిపల్ కే.విజయ్‌కుమార్, అధ్యాపకులు దినకర్, శ్రీనివాస్‌రావు, శ్రీవల్లి, వెన్నెల, రమణ, ఫారెస్ట్ రేంజ్ అధికారి రమే శ్, శ్రీధర్‌రావు, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట: గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను ప్రభుత్వం వెంటనే పంపిణీ చేయాలని గత రెండు సంవత్సరాలు పంపిణీ వ్యవస్థ ఆగిపోయిందని అఖిల భారత యాదవ జిల్లా మహాసభ ఉపాధ్యక్షులు యూత్ మహేష్ యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని మాందాపూర్ గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. గొర్రెల, మేకల పెంపకదారులు కనీసం ఎలాంటి నట్టల నివారణ మందులు ఇవ్వడం లేదని, వందల సంఖ్యలో జీవాలు మరణిస్తున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.పశుసంవర్ధక శాఖ తక్షణమే స్పందించి వెంటనే పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
బాన్సువాడ: బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని ఆయన వర్గీయులు అన్నారు. బాన్సువాడలో శనివారం వారు మాట్లాడారు. తెలంగాణలో ఎక్కడ లేనివిధంగా బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత పోచారం శ్రీనివాస్‌రెడ్డికే దక్కిందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో సీఎం రేవంత్‌రెడ్డి సహకారం కోసం ఆయనను కలిశారని అన్నారు. అందుకు ఇప్పటి వరకు రూ.100 కోట్ల పెండింగ్ బిల్లులు మంజురు చేశారని అన్నారు. 16 నెలల కాలంలో రోడ్ల అభివృద్ధికి రూ.150కోట్ల నిధులు మంజురు చేయించారని గుర్తు చేశారు. 2004లో బాన్సువాడలో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడను రాయలసీమగా మార్చారని ఆరోపించారు. సమావేశంలో పోచారంవర్గం నాయకులు కృష్ణరెడ్డి, గురువినయ్, పిట్ల శ్రీధర్, నార్ల సురేష్, జంగం గంగాధర్, ఎజాస్, ఖలేక్ తదితరులు ఉన్నారు.
డొంకేశ్వర్(ఆర్మూర్): ఐకేపీ సిబ్బందికి శనివారం గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో ఆడిట్‌పై అవగాహన కల్పించారు. నిజామాబాద్‌తోపాటు కామారెడ్డి, నిర్మల్ జిల్లాల ఐకేపీ ఉద్యోగులు హాజరయ్యారు. హైదరాబాద్ సెర్ప్ నుంచి వచ్చిన చీఫ్ ఆడిట్ ఆఫీసర్ ఎంవీ కృష్ణ సిబ్బందికి పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామ సంఘం, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యకు ఏవిధంగా చేస్తే సంస్థల ఆర్థిక పరిస్థితి, రికవరీ, అడ్వాన్స్‌లు వస్తాయో వివరించారు. ఆడిట్‌లో వచ్చిన అభ్యంతరాలను డీఆర్‌డీవోకు ప్రతి నెలా పంపాలని సూచించారు. మూడు జిల్లాల డీఆర్‌డీవోలు సాయాగౌడ్, విజయలక్ష్మి, సురేంధర్, ఏపీడీ మధుసూదన్, ఫైనాన్స్ డీపీఎం కిరణ్‌కుమార్ తదితరులున్నారు.
జీవ వైవిధ్యంతోనే పర్యావరణ పరిరక్షణ


