స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలని ర్యాలీ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్స్, స్కాలర్‌షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రూ. 8900కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. స్కాలర్‌షిప్‌లు రాకపోండంలో ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులను వేధిస్తున్నారని, పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు సంజయ్, కౌషిక్, ఆకాష్, విష్ణు, లోకేష్, విఘ్నేష్, శ్రవ్య, సంధ్య, విద్యార్థులు పాల్గొన్నారు.
అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలి
నాగిరెడ్డిపేట/లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండలం లొంకలపల్లి శివారులో చిరుతపులి సంచారంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని నాగిరెడ్డిపేట డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి రవికుమార్ అన్నారు. లొంకలపల్లి శివారులో రెండురోజులుగా చిరుతపులి సంచరిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామశివారులోని పంటచేనుల్లో చిరుతపలి పాదముద్రలు కనిపించడంతో వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో శనివారం అటవీశాఖ అధికారి రవికుమార్, బీట్ ఆఫీసర్ నవీన్ గ్రామ సమీపంలోని వ్యవసాయభూముల్లో చిరుతపులి పాదముద్రలను గుర్తించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటకోతలు ప్రారంభమైన నేపథ్యంలో పొలాలకు వెళ్లే అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులను అప్రమత్తం చేశారు. కాగా ఫారెస్ట్ అధికారులు బోను ఏర్పాటు చేసి చిరుతపులిని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలని ర్యాలీ
స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలని ర్యాలీ


