పకడ్బందీగా ఓటరు జాబితా
కామారెడ్డి క్రైం: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఓటరు జాబితాను పకడ్బందీగా తయారు చేయడం జరుగుతున్నదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పురోగతిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శనివారం అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్‌ఐఆర్ ను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశిస్తూ పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. జిల్లాలో ఓటరు జాబితా రూపకల్పనకు సంబంధించిన వివరాలను, తీసుకుంటున్న చర్యలను ఎన్నికల అధికారికి వివరించారు. బీఎల్‌వోలు, సూపర్‌వైజర్ లతో సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామన్నారు. వారం రోజుల్లోగా జాబితాలను సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. ఈ వీసీలో కామారెడ్డి నుంచి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్‌వో మధు మోహన్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహా రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
కామారెడ్డి క్రైం: అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ క్రీడాకారులకు సూచించారు. ఇటీవల జరిగిన జాతీయస్థాయి అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులు కలెక్టర్‌ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారిని సన్మానించారు. కృషి, పట్టుదలతో ముందుకుసాగి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వర్‌గౌడ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి, కార్యదర్శి అనిల్ పాల్గొన్నారు.
తెలంగాణ తల్లివిగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన
కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు కలెక్టర్ సంగ్వాన్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్‌లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పి ంచిందని, ఇందుకోసం రూ.5.80 కోట్లు కేటాయించిందన్నారు. స్థలాన్ని పరిశీలించిన అనంతరం అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్‌అండ్‌బీ ఈఈ మోహన్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పకడ్బందీగా ఓటరు జాబితా


