దుకాణాల్లో అధికారుల తనిఖీ
బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో పలు ఏజెన్సీ దుకాణాలను శనివారం తూనికల, కొలతల అధికారులు స్పందించారు. తూకం.. మోసం శీర్షికన శనివారం ప్రచురితమైన కథానానికి అధికారులు పలు దుకాణాల్లో తూకం చేసే యంత్రాలు, ఆయిల్ డబ్బాలు, బియ్యం సంచులను పరిశీలించారు. తూకాల్లో ఎలాంటి మోసాలకు తావివొద్దని, మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
కామారెడ్డి టౌన్: ఈనెల 26, 27వ తేదీలలో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జరిగే తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాలుగోవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మొదటి రోజు బహిరంగ సభ, రెండవ రోజు ప్రతినిధుల సభ ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం ఆశాలకు రూ. 18వేలు ఫిక్స్‌డ్ వేతనం చెల్లించాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాం కల్పించాలన్నారు. 26 న జరిగే బహిరంగ సభకు జిల్లాలోని ఆశా కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాజనర్సు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇందిరా, రాజశ్రీ, మమత, భాగ్యలక్ష్మి, పల్లవి, కవిత, లలిత, గంగమణి తదితరులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్: మండలంలోని బొమ్మన్‌దేవ్ పల్లిలో ధాన్యం విక్రయం కాక పోవడంతో కల్లాలకే ధాన్యం పరిమితం అయ్యాయి. ఎండ బెట్టినా కూడా వాతావరణం అనుకూలించక పోవడంతో మాయిశ్చర్ రాక ముందే కుప్పలుగా చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు వాతావరణం అనుకూలించక మరో పక్క రైస్ మిల్లర్లు వ్యతిరేకిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
దుకాణాల్లో అధికారుల తనిఖీ
దుకాణాల్లో అధికారుల తనిఖీ
దుకాణాల్లో అధికారుల తనిఖీ


