పాడి సంపదను పెంచుకోవాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): రైతులు వ్యవసాయంతో పాటు పాడి సంపదను పెంచుకోవాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంటు డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి, కాలోజివాడి గ్రామాలలో శనివారం గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రైతులు తమ పశవులకు తప్పనిసరిగా గాలికుంటు నిరోధక టీకాలను వేయించాలన్నారు. లేనియెడల పశువులలో పాలదిగుబడి గణనీయంగా తగ్గుతుందన్నారు.ఈసందర్భంగా 60 ఆవులు, 348 గేదేలకు గాలికుంటూ నిరోధక టీకాలను ఇచ్చారు. అలాగే సాధారణ చికిత్సలు కూడా చేశారు. ఈ కార్యక్రమంలో మండల పశవువైద్యాధికారి రమేష్, వీఎల్‌వో పోచయ్య, జేవీవోలు కొండల్‌రెడ్డి, ప్రేంసింగ్, గోపాల మిత్రలు మహిపాల్‌రెడ్డి, బ్రహ్మం, రైతులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: మండలంలోని బుడిమి, కాద్లాపూర్ గ్రామాల్లో శనివారం పశుసంవర్ధకశాఖ ఆధ్వ ర్యంలో ఆవులు, ఎడ్లు, బర్రెలు, పోతులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. రైతులు విధిగా తమ పశువులకు టీకాలు వేయించాలని మండల పశువైద్యాధికారి జైపాల్‌సింగ్ సూచించారు.ఆఫీస్ సబార్డినేట్ ఖాదర్, బాలరాజు, గోపాల మిత్ర ప్రవీణ్, సాయిలు, పాడిరైతులు తదితరులు పాల్గొన్నారు.


