శోభాయాత్ర శాంతియుతంగా జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

శోభాయాత్ర శాంతియుతంగా జరుపుకోవాలి

Oct 1 2025 10:09 AM | Updated on Oct 1 2025 10:09 AM

శోభాయ

శోభాయాత్ర శాంతియుతంగా జరుపుకోవాలి

శోభాయాత్ర శాంతియుతంగా జరుపుకోవాలి పోలీసుల విస్తృత తనిఖీలు బాండ్‌ పేపర్లను నమ్మే పరిస్థితి లేదు

రుద్రూర్‌: దుర్గామాత నిమజ్జన శోభాయాత్రను శాంతియుతంగా జరుపుకోవాలని కోటగిరి ఎస్సై సునీల్‌ సూచించారు. కోటగిరి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సై మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని, డీజేలు పెట్టవద్దని సూచించారు.

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ పట్టణంలో మంగళవారం రాత్రి నిషేధిత మాదక ద్రవ్వాలపై ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పాతబస్టాండ్‌లో ప్రయాణికుల బ్యాగులు, హోటల్స్‌లలో, పాన్‌షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, ఇతర చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు శిక్షణ పొందిన స్నిపర్‌ డాగ్‌ల ద్వారా పరిశీలించారు.

కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

మోపాల్‌: మోపాల్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్‌ గంగాప్రసాద్‌ను పో లీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య సస్పెండ్‌ చేసిన ట్లు సీఐ సురేశ్‌కుమార్‌ మంగళవారం తెలిపా రు. పోలీస్‌స్టేషన్‌కు సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని చేరవేయడం, వి ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శా ఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నా రు. విలువైన సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ సురేశ్‌కుమార్‌ హెచ్చరించారు.

కేసీఆర్‌ పాలనలో

యూరియా కొరత రాలేదు

మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి

సుభాష్‌నగర్‌ : బాండ్‌ పేపర్ల సంగతి జిల్లా ప్రజలందరికీ తెలుసని, ప్రస్తుతం బాండ్‌ పేపర్లను నమ్మే పరిస్థితి లేదంటూ ఎంపీ అర్వింద్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం భీమ్‌గల్‌ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పని అయిపోయిందని, ఆ పార్టీ ఉండదని అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ రాసిస్తా అంటున్నాడని తెలిపారు. బాండ్‌ పేపర్‌ పేరుతో ఎంపీ ఒకసారి చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేరని, అందుకే బాండ్‌ పేపర్లను నమ్మే పరిస్థితి లేదన్నారు. అర్వింద్‌ తన స్థాయిని తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే ఏంటో ఒకసారి బడా భీమ్‌గల్‌కు వచ్చి చూడాలని సవాల్‌ విసిరారు. పసుపు రైతులను మోసం చేస్తున్న చరిత్ర ఎంపీదని, పసుపు బోర్డుకు ఒక నేమ్‌ బోర్డు ఉంది తప్ప పంటకు మద్దతు ధర ఇంకా తేలేదని ఆరోపించారు. బోర్డు రాక ముందు రూ.10వేలు పలికిన ధర ప్రస్తుతం రూ.6వేలకు పడిపోయిందని విమర్శించారు. దేశం కోసం అని నమ్మి.. మోదీని చూసి రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. రైతులకు కనీసం యూరియా బస్తాలు ఇప్పించరా? అని ప్రశ్నించారు. 8 మంది కాంగ్రెస్‌, 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్‌ పాలనలో ఏనాడూ యూరియా కొరత రాలేదని తెలిపారు. ఓటేసి గెలిపిస్తే ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మోదీతో రాష్ట్రానికి, అర్వింద్‌తో జిల్లాకు ఒరిగిందేమీ లేదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని అన్నారు.

శోభాయాత్ర శాంతియుతంగా జరుపుకోవాలి1
1/1

శోభాయాత్ర శాంతియుతంగా జరుపుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement