
దేశ ప్రయోజనాలే సంఘ్ సభ్యులకు ముఖ్యం
బీబీపేట: ఆర్‌ఎస్‌ఎస్ సభ్యులకు వ్యక్తి, కుటుంబం, సంస్థ, కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విభాగ్ సహకార్యవాహ పాపయ్యగారి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. దేశ సేవలో సంఘ్ పాత్ర ఎంతో గొప్పదన్నారు. దేశంలో ప్రపంచంలో ఎన్నో సంస్థలు, సంఘాలు ఏర్పడ్డాయని కానీ కాలగమనంలో గతించాయన్నారు. కానీ సంఘ్ మాత్రం దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు కోసం మాత్రమే పని చేసిందని, భవిష్యత్తులో కూడా చేస్తుందని తెలిపారు. సంస్థప్రతినిధులు ఏదుల్ల ఇంద్రసేనారెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు
మద్నూర్(జుక్కల్): మండలంలోని మేనూర్‌లో మంగళవారం ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను స్వయం సేవకులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనూర్‌లోని ప్రధాన వీధులలో స్వ యం సేవకులు పద సంచలన్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ జి ల్లా విభాగ్ ప్రచారక్ శివకుమార్ మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఆపద వచ్చినా స్వయం సేవకులు ముందుండి సహాయక చర్యల్లో పాల్గొంటారన్నారు. ప్రాణాలకు తెగించి విపత్కర పరిస్థితులను సైతం లెక్క చే యకుండా స్వయం సేవకులు చేసిన సామాజిక కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయన్నారు. దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో స్వయం సేవకులు, ప్రజలు పాల్గొన్నారు.

దేశ ప్రయోజనాలే సంఘ్ సభ్యులకు ముఖ్యం