
బీఎస్‌ఎన్‌ఎల్ సమృద్ధి జీపీగా వేల్పూర్
వేల్పూర్: బీఎస్‌ఎన్‌ఎల్ సమృద్ధి గ్రామ పంచాయతీగా వేల్పూర్ ఎంపికై నట్లు సంస్థ హైదరాబాద్ నోడల్ అధికారి నంబి మృదుపాణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె వేల్పూర్ గ్రామ పంచాయతీలో బీఎస్‌ఎన్‌ఎల్ సమృద్ధి ద్వారా అందించే సేవలను వెల్లడించారు. సమృద్ధి ద్వారా అంతరాయం లేకుండా ఇంటర్నెట్ సేవలు లభిస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ సబ్ డివిజన్ ఇంజినీర్ హనుమాన్‌సింగ్, మోర్తాడ్ ఎస్‌డీఈ చిన్నయ్య, నెట్‌వర్క్ ఇంజినీర్ సుమన్‌రెడ్డి, మోర్తాడ్ ఫీల్డ్ టెక్నీషియన్ సతీశ్‌కుమార్, జేఈ రాకేశ్‌కుమార్, వేల్పూర్ టీఐపీ సుధాకర్ పాల్గొన్నారు.
నవీపేట: మండలంలోని యంచ గోదావరి నది బ్రిడ్జిపై దుర్గామాత నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని బీజేపీ నాయకులు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డికి జిల్లా కేంద్రంలో మంగళవాం వినతిపత్రం సమర్పించారు. దూర ప్రాంతంలోని దుర్గామాత విగ్రహాలను యంచ గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారని, ఇంత వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు వడ్డి మోహన్‌రెడ్డి, మండల నాయకులు ద్యాగ సరిన్, రాజేందర్‌గౌడ్, రాజశేఖర్, భూషన్ తదితరులు పాల్గొన్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్ సమృద్ధి జీపీగా వేల్పూర్