
ముగిసిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు
పెర్కిట్(ఆర్మూర్): ఆలూర్ మండలం మచ్చర్లలో గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 24 జట్లు పాల్గొన్నాయి. తుది పోరులో జక్రాన్‌పల్లి మండలం పడ్కల్ తండా విజేతగా నిలువగా, మచ్చర్ల రెండో స్థానంలో నిలిచింది.
విజేతలకు స్థానిక కాంగ్రెస్ నాయకుడు యెర్ర జితేందర్ రెడ్డి రూ.8,888 నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో షేక్ సమీర్, వెల్మ రాజ్‌కుమార్, ఉప్పు గంగారెడ్డి, కొర్వ ప్రవీణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.