
ఫెయిల్యూర్ సీఎం రేవంత్‌రెడ్డి
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
మాచారెడ్డి : ఫెయిల్యూర్ సీఎంగా రేవంత్‌రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. శుక్రవారం పాల్వంచ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు బుట్ట దాఖలయ్యాయన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి ద్రోహం చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దిన్, మాజీ జెడ్పీటీసీ మిన్కూరి రాంరెడ్డి, మాచారెడ్డి మండల శాఖ అధ్యక్షుడు బాల్‌చంద్రం, రాజాగౌడ్, హంజీనాయక్, కూచని శేఖర్, తదితరులున్నారు.
పాల్వంచ మండల అధ్యక్షుడిగా రాజాగౌడ్..
బీఆర్‌ఎస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షుడిగా ఇసాయిపేటకు చెందిన రాజాగౌడ్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ ఆయన్ను సన్మానించారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు.