
అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి
కామారెడ్డి రూరల్: అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం దేవునిపల్లి, కల్కినగర్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండప నిర్వహకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు.
కామారెడ్డి అర్బన్: స్థానిక ఎన్జీవోస్ కాలనీలోని లలితా త్రిపుర సుందరి ఆలయ 8వ వార్షికోత్సవం శనివారం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా లలితా హవనం, విశేషపూజలు, మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం కుమారి పూజ నిర్వహించనున్నట్టు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.