
బతుకమ్మ పాట
బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో...
బంగారు గౌరమ్మ ఉయ్యాలో...
మా ఇంట కొలువుండు ఉయ్యాలో...
మా కష్టాలు తీర్చు ఉయ్యాలో...
తంగేడు పూలమ్మ ఉయ్యాలో...
తెలంగాణ శోభమ్మ ఉయ్యాలో...
గునుగు పూల వైభవము ఉయ్యాలో...
గుండెలనిండా నిలిచి ఉయ్యాలో...
పసుపు పారాణమ్మ ఉయ్యాలో...
ప్రాణాల తోడమ్మ ఉయ్యాలో...
ప్రకృతిని పూజిద్దాం ఉయ్యాలో...
పాటలతో కొలుద్దాం ఉయ్యాలో...
తొమ్మిది రోజులమ్మ ఉయ్యాలో...
తొమ్మిది రూపాలమ్మ ఉయ్యాలో...
సద్దులొచ్చిన రోజు ఉయ్యాలో...
సంతోషాల క్రాంతి ఉయ్యాలో...
అట్లు సత్తుపిండ్లూ ఉయ్యాలో...
ఆప్యాయత పంచె ఉయ్యాలో...
అందరొక్కటై ఆడుదాం ఉయ్యాలో...
ఆనందంగా పాడుదాం ఉయ్యాలో...
చెరువు నీరు నిండే ఉయ్యాలో...
చల్లగ లోకముండే ఉయ్యాలో...
కన్నతల్లి భూమిని ఉయ్యాలో...
కళకళలాడించే ఉయ్యాలో...
మాంగల్యం నిలబెట్టు ఉయ్యాలో...
మా మనసులు చూడమ్మ ఉయ్యాలో...
నీ దీవెన మాకిచ్చి ఉయ్యాలో...
తరతరాల సౌభాగ్యమై ఉయ్యాలో...
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...
మళ్లీ వచ్చేవరకు ఉయ్యాలో...
మరల మరల తలచుచు
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో...
– సుధ మర్రివాడ, టీచర్
హంగర్గాఫారం