
వైభవంగా నవదుర్గావ్రతం
కామారెడ్డి అర్బన్: దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి హౌసింగ్‌బోర్డులోని శారదమాత శక్తి పీ ఠం ఆధ్వర్యంలో శుక్రవారం సహస్ర సుహాసినీలతో న వదుర్గ సహిత కోటి కుంకుమార్చన, వ్రతం భక్తిశ్రద్ధల తో వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని మహిళ లు పెద్ద ఎత్తున వ్రతంలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేశారు. వేద పండితులు జి.అంజనేయశర్మ మార్గదర్శకత్వంలో అర్చకులు సతీష్‌పాండే, ఇతర అర్చకులు వ్రతం నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు పెంటయ్య, శ్రీధర్, శ్రీహరి, శారదా మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం అందజేశారు.

వైభవంగా నవదుర్గావ్రతం