
జీఎస్టీ తగ్గింపుతో భారం తగ్గింది
మద్నూర్(జుక్కల్): జీఎస్టీ తగ్గింపుతో ప్రజలపై అదనపు భారం తగ్గిందని బీజేపీ డోంగ్లీ మండల అధ్యక్షుడు ధనంజయ పాటిల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిన సందర్భంగా బీజేపీ నాయకులు మంగళవారం డోంగ్లీ మండల కేంద్రంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి పాలతో అభిషేకం నిర్వహించి మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో వ్యాపారులకు మంచి లాభదాయకమని అన్నారు. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉంటే మన దేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందన్నారు. ప్రజల శ్రేయస్సు కోరే ప్రధానమంత్రి ఉండటం ఆనందంగా ఉందన్నారు. ప్రధాన కార్యదర్శి సచిన్, ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ పటేల్, రేవాన్, గంగాధర్, రామాగౌడ్, శంకర్, మోహన్, ఆశోక్, దత్తు, భీంరావ్, నాగేష్ తదితరులున్నారు.