
షార్ట్‌సర్క్యూట్‌తో దుకాణం దగ్ధం
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలోని మావులీ హోల్‌సెల్ బేకరి, కిరాణ దుకాణం శుక్రవారం షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. టీచర్స్ కాలనీలోని కోండవార్ రాకేష్ హోల్‌సెల్ బేకరి, కిరాణ దుకాణం నడపుతున్నాడు. శుక్రవారం ఆయన వేరే ఊరికి వెళ్లగా అతడి భార్య ఉజ్వల దుకాణంలో ఉంది. దుకాణం వెనకభాగంలోంచి ఒక్కసారిగా దట్టమైన మంటలు, పొగ వ్యాపించడంతో భయంతో ఆమె బయటకు పరుగులు తీసింది. స్థానికులు వెంటనే మద్నూర్ ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. దుకాణం మొత్తం మంటలు వ్యాపించి వస్తువులు మొత్తం కాలిబుడిదయ్యాయని బాధితులు తెలిపారు. దుకాణం మొదటి అంతస్తులో కిరాయికి ఉన్న వారు మంటలను చూసి పక్కన ఉన్న మరో ఇంటిలోంచి బయటకు వచ్చేశారు. ఫైర్‌సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. మద్నూర్ ఎస్సై విజయ్‌కొండ, పోలీసు, ఫైర్ సిబ్బంది స్థానికుల సహాయంతో దుకాణం పక్కనే ఉన్న మరో గోడౌన్‌లోని సామాన్లు బయటకు పడేయడంతో ఆస్తినష్టం తగ్గిందని వారు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకున్న తర్వాత దుకాణం లోపల స్టీల్ డబ్బాలో దాచిన ఉన్న 15 తులాల బంగారం, రూ.3 లక్షల నగదును లీడింగ్ ఫైర్‌మెన్ నరసింహులు బాధితులకు అప్పగించారు. ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఫైర్ సిబ్బంది హరీష్, రాణాప్రతాప్, రాజు, దిగంబర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.