
విమోచన దినోత్సవం రోజున సేవా కార్యక్రమాలు
బాన్సువాడ: తెలంగాణ విమోచన దినోత్సవం రోజు(సెప్టెంబర్ 17)ను పురస్కరించుకుని బాన్సువాడలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి తెలిపారు. శుక్రవారం బాన్సువాడ బీజేపీ కార్యాలయంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం పురస్కరించుకుని పలు సేవ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అయ్యప్ప ఆలయంలో మోదీ పేరుపై అర్చన, ఆస్పత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 18న స్వచ్ఛ భారత్ పేరిట బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్‌లో పరిశుభ్రత కార్యక్రమం ఉంటుందని అన్నారు. కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, శంకర్‌గౌడ్, మోహన్‌రెడ్డి, మజ్జిగ శ్రీనివాస్, చిరంజీవి, శంకర్, మహేష్, అనీల్, సాయిబాబా, కొండని తదితరులున్నారు.