
విద్యార్థి ప్రతిభకు ప్రోత్సాహం
● ‘ఎన్‌ఎంఎంఎస్’తో
ఉపకారవేతనాల అందజేత
● పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల
ప్రక్రియ ప్రారంభం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి ఎన్‌ఎంఎంఎస్(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్) పేరుతో స్కాలర్ షిప్‌లను అందజేస్తుంది. దీని కోసం ఆయా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. పరీక్ష విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఎనిమిదో తరగతి తర్వాత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా ఇంటర్ వరకు కొనసాగించేలా స్కాలర్ షిప్‌లను అందిస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది.
● అర్హతలు: ఏడో తరగతిలో కనీసం 55శాతం మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదివేవారు. ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3–5 లక్షల లోపు ఉండాలి.
● కావాల్సిన పత్రాలు: ఆధార్ కార్డు, స్టడీ, కులం, ఆదాయం సర్టిఫికెట్‌లు
● పరీక్ష ఫీజు: ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల విద్యార్థులకు రూ. 50
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 6
● పరీక్ష తేదీ: నవంబర్ 23న (డివిజన్ కేంద్రాల్లో)