
దుబాయ్‌లో మోపాల్‌వాసి మృతి
మోపాల్: మండలకేంద్రానికి చెందిన తలారి సవీన్ (35) దుబాయ్‌లో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. సవీన్ ఆగస్ట్ 16న ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. 21న కంపెనీలో పని ముగించుకుని గదిలోకి వచ్చిన సవీన్.. ఫోన్, పర్సు, గుర్తింపు కార్డులు పెట్టి వెళ్లిపోయాడు. ఈనెల 26న రోడ్డు పక్కన చెట్టు కింద విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వివరాల కోసం ప్రయత్నించారు. తెలియకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగా గల్ఫ్ సంఘాలు, గ్రామస్తులు సవీన్ తప్పిపోయాడని వీడియో రూపొందించి వైరల్ చేశారు. ఆ వీడియోను పరిశీలించిన పోలీసులు.. వివరాలు సేకరించి కంపెనీకి సమాచారమిచ్చారు. సవీన్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గల్ఫ్ సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. త్వరగా మృతదేహాన్ని రప్పించే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మృతుడి తండ్రి తలారి చిన్న లక్ష్మణ్ సైతం దుబాయ్‌లో ఉన్నాడు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య కృష్ణవేణి కోరుతున్నారు.
వాకింగ్ చేస్తున్న యువకులను ఢీకొన్న లారీ
● ఇద్దరికి గాయాలు
కామారెడ్డి క్రైం: వాకింగ్ చేస్తున్న యువకులను ఓ లారీ అదుపుతప్పి, ఢీకొన్న ఘటన కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి సమీ పంలోని జాతీయ రహదారిపై చోటుచేసు కుంది. వివరాలు ఇలా.. శాబ్దిపూర్ రైట్ తండాకు చెందిన శివ కుమార్, రామేశ్వర్‌పల్లి తండాకు చెందిన బదావత్ సంజీవ్ కలిసి శుక్రవారం ఉదయం వాకింగ్ పూర్తిచేసుకుని తిరిగి తమ ఇళ్లకు బయలుదేరారు. రామేశ్వర్‌పల్లి సమీపంలోని జాతీయ రహదారిపై వారిని ఓ గుర్తు తెలియని లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంజీవ్‌కు స్వల్ప గాయాలు కాగా శివ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. మెరుగైన చికిత్స కోసం శివ కుమార్‌ను హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు.
ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టిన కారు
బోధన్‌రూరల్: సాలూర మండలకేంద్రంలోని శివారులో శుక్రవారం ఓ కారు అతివేగం కారణంగా అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు, ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసమయ్యాయి. కారులోని ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్‌రెడ్డి తెలిపారు.
ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత
బాన్సువాడ: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోలెరో వాహనాన్ని శుక్రవా రం సీఐ అశోక్ పట్టుకున్నారు. బీర్కూర్ నుంచి అక్రమంగా వాహనంలో ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సోమేశ్వర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.

దుబాయ్‌లో మోపాల్‌వాసి మృతి