
పంట పొలాల్లో ఇసుక మేటల తొలగింపు
లింగంపేట(ఎల్లారెడ్డి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను శుక్రవారం ఉపాధి హామీ కూలీలతో తొలగిస్తున్నట్లు డీఆర్డీవో సురేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బూరుగిద్ద ఊర చెరువు కట్ట తెగిపోవడంతో ఇసుక మేటలు ఏర్పడ్డాయన్నారు. ఉపాధి హామి కూలీలతో ఇసుక మేటలు తొగించాలని కలెక్టర్ ఆదేశించడడంతో కూలీలను ఏర్పాటు చేసి ఇసుక మేటలను తొలగిస్తున్నామన్నారు. ఇసుక మేటలు తొలగించి తిరిగి పంటలు సాగయ్యేలా చేస్తామన్నారు. ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి, ఏపీవో నరేందర్, తదితరులున్నారు.
బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డిరూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే దోస్త్‌కు ఆశించిన స్పందన రాకపోవడంతో స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నారు. బాన్సువాడలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాల, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు డాక్టర్ గంగాధర్, లక్ష్మీనారాయణ వేర్వేరుగా తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని వారు కోరారు. ఈ ఏడాది మాత్రమే కల్పించిన స్పాట్ అడ్మిషన్ల విధానాఽన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
రామారెడ్డి: ప్రజల్లోకి ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకెళ్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ప్రవీణ్ గౌడ్ అన్నారు. శుక్రవారం రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ప్రవీణ్‌గౌడ్‌ను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. తనకు మండల అధ్యక్ష పదవి రావడానికి కారణమైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌కు ప్రవీణ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

పంట పొలాల్లో ఇసుక మేటల తొలగింపు