
వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీహెచ్‌సీ వైద్యాధికారిణి ఆస్మా అప్షిన్ అన్నారు. శుక్రవారం కుప్రియాల్, ధర్మారావ్‌పేట్, భూంపల్లి, లింగంపల్లి తదితర గ్రామాల్లో వైద్య శిబిరం నిర్వహించారు. సీహెచ్‌వో నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట: రాజంపేట, తలమడ్ల గ్రామాల్లో రాజంపేట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించినట్లు వైద్యాధికారి విజయ మహాలక్ష్మి తెలిపారు. పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీవో రఘురాం, డాక్టర్ సంగీత, సూపర్వైజర్ మహమ్మద్ మంజూర్, గంగామణి, జీపీ సెక్రెటరీ అశోక్ కుమార్, వైఆర్‌జీకేర్ సుధాకర్, క్లస్టర్ లింక్ వర్కర్ శ్వేత, లావణ్య పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మాటూర్, లింగంపల్లికలాన్, ఎర్రకుంటతండాలలో శుక్రవారం వైద్యశిబిరాలను నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి మందులను అందజేశారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యదర్శులు రవీందర్, వనజ, అనిత, హెల్త్ సూపర్‌వైజర్ మణెమ్మ, ఎంఎల్‌హెచ్‌పీలు సుజాత, అపర్ణ, అజయ్, ఏఎన్‌ఎంలు మంగ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి