అడుగుకో గుంత.. తీరేనా చింత | - | Sakshi
Sakshi News home page

అడుగుకో గుంత.. తీరేనా చింత

Sep 13 2025 6:05 AM | Updated on Sep 13 2025 6:05 AM

అడుగు

అడుగుకో గుంత.. తీరేనా చింత

అడుగుకో గుంత.. తీరేనా చింత

నరకం కనిపిస్తోంది

భిక్కనూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. భిక్కనూరు–రామేశ్వర్‌పల్లి, భిక్కనూరు–అంతంపల్లి, పెద్దమల్లారెడ్డి– ఇసన్నపల్లి, మల్లుపల్లి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ మార్గాల్లో అడుగుతీసి అడుగేస్తే గుంత ప్రత్యక్షమవుతోంది. ఈ గ్రామాలకు వెళ్లే వారు నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాలపైన కాకుండా నడుచుకుంటూ వెళ్లినప్పటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ మార్గాల్లో వాహనాదారులు కింద పడి గాయాలపాలవుతున్నారు. వెంటనే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి రోడ్లను బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు.

భిక్కనూరు నుంచి తిప్పాపూర్‌ గ్రామానికి వెళ్లాలంటే రామేశ్వర్‌పల్లి మీదుగా వెళ్లాల్సి వస్తోంది. భిక్కనూరు–రామేశ్వర్‌పల్లి రోడ్డు పూర్తిగా దెబ్బతినింది. ఈ రోడ్డుపై వెళ్తూ నరకం చూస్తున్నాం. గుంతలతో పాటు బురదమయంగా మారింది. నడుచుకుంటూ వెళ్లినా నరకం తప్పడం లేదు.

– స్వామి, తిప్పాపూర్‌

అడుగుకో గుంత.. తీరేనా చింత1
1/1

అడుగుకో గుంత.. తీరేనా చింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement