అలుగు పారుతున్న పోచారం ప్రాజెక్టు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని పోచారంప్రాజెక్టు 15 రోజులుగా అలుగు పారుతూనే ఉంది. ప్రాజెక్టుకు వచ్చే వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఇన్‌ఫ్లోగా వచ్చిన నీరు అలుగుపై నుంచి జాలువారుతూ దిగువకు ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,182 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుండగా 1,152 క్యూసెక్కుల నీరు అలుగుపై నుంచి దిగువకు ప్రవహిస్తూ అవుట్‌ఫ్లోగా వెళ్తుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
అవగాహనే ఆయుధం
కామారెడ్డి క్రైం: అవగాహన పెంచుకోవడమే సైబర్ నేరాల నియంత్రణకు ప్రధాన ఆయుధమని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా పో లీస్ కార్యాలయంలో సైబర్ నేరాల నియంత్రణపై గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సైబర్ వారియర్లకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో తయారు చేసిన టీషర్టులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో సైబ ర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయని అన్నారు. నేరాల నియంత్రణపై పూర్తి అవగాహన కలిగి ఉంటూ సాంకేతిక నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1930కి లేదా స్థానిక పోలీసులకు లేదా ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేసేలా ప్రతి పోలీస్ స్టేషనన్‌్ పరిధిలోనూ నిపుణుల బృందం ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సైబర్ క్రైం జిల్లా నోడల్ అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.
పరామర్శ
భిక్కనూరు: ఏఎంసీ మాజీ డైరెక్టర్ బుర్రిగోపాల్‌ను బీఆర్‌ఎస్ యువజన విభాగం రాష్ట్ర నేత గంప శశాంక్ గురువారం పరామర్శించారు. గోపాల్ తల్లి రాజవ్వ రెండు రోజుల క్రితం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న శశాంక్.. బస్వాపూర్ గ్రామానికి వచ్చి గోపాల్‌ను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు రంజిత్ వర్మ, నేతలు ఉన్నారు.

అలుగు పారుతున్న పోచారం ప్రాజెక్టు