
యువకుడి అదృశ్యం
ఖలీల్‌వాడి: నగరంలోని వినాయక్ నగర్‌కు చెందిన కాంపెల్లి రాము అదృశ్యం అయినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. వినాయక్ నగర్‌లోని అంగిటి హోటల్ వద్ద రాము అదృశ్యమయ్యాడని, అతడి మానసిక స్థితి బాగాలేదని సోదరుడు తిరుపతి పేర్కొన్నాడు. తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరికై నా రాము ఆచూకీ తెలిస్తే 8712659840, 8712659836కు సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు.
అక్రమ మద్యం స్వాధీనం
మోర్తాడ్: భీమ్‌గల్ మండలం బాబాపూర్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై గోవర్ధన్ గురువారం తెలిపారు. బాబాపూర్‌కు చెందిన జంగిటి నరేష్, సుమలత వద్ద 7.92 లీటర్ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నామని, వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమ మద్యం స్వాధీనం ఘటనలో సిబ్బంది దత్తాద్రి, శ్రీనివాస్‌రెడ్డి, జగదీష్, రాణిలు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని పోచమ్మ కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. కాలనీలో ఏడాది కాలంగా వ్యభిచారం చేస్తుండగా బుధవారం రాత్రి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్సై రాఘవేంద్ర సిబ్బందితో కలిసి సదరు గృహంపై దాడి చేశారు. బాన్సువాడ పట్టణానికి చెందిన సంగమిత్ర, బ్రమోత్ జయ, సాయాగౌడ్, బస్వాయిపల్లికి చెందిన హైమద్‌లను అదుపులోకి తీసుకున్నారు. నస్రుల్లాబాద్‌లో అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్న ఇంటి యజమానిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. వారి వద్ద నుంచి రెండు ఫోన్లు రూ.500 నగదు స్వాదీనం చేసుకున్నామన్నారు. సంబంధిత వ్యక్తులపైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
బోధన్‌రూరల్: సాలూర మండలంలోని మందర్న శివారులో గురువారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లను, 2 ఆటోలను సాలూర రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన వాహనాలను బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తహసీల్దార్ శశిభూషణ్ తెలిపారు.

యువకుడి అదృశ్యం