
కలం గొంతు నొక్కడమే..
● ‘సాక్షి’ ఎడిటర్, పాత్రికేయులపై
అక్రమ కేసులు
● స్వేచ్ఛను హరించడమే..
● అక్రమ కేసులను
ఎత్తివేయాలని డిమాండ్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్ : ప్రజల పక్షాన అక్షర సమరం చేస్తున్న ‘సాక్షి’ పై కక్షగట్టి న ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్ర భుత్వం అక్రమ కేసులతో గొంతునొక్కుతూ భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందని జర్నలిస్టు, ప్రజాసంఘాల నేతలు విమర్శించారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్ ధనంజయరెడ్డితో పాటు పలువురు సాక్షి జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం అక్రమకేసులు బనాయించి వేధించడాన్ని నిరసించారు. పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని మండిపడ్డారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వ్యక్తిగత కక్ష సాధిస్తోంది. సాక్షి దినపత్రికపై పలుమార్లు దాడులు, అక్రమ కేసులు బనాయించడమే ఇందుకు నిదర్శనం. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి, అన్యాయం, అవినీతిపై వార్తలు రాసే పత్రికా స్వేచ్ఛను హరించడం దారుణం.
– రజనీకాంత్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు
పత్రికాస్వేచ్ఛపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే చట్టపరంగా పోవాలే తప్పా ఇలా వ్యక్తిగతంగా సాక్షిపై కక్ష గట్టి అక్రమ కేసులు బనాయిండం, దాడులు చేయించడం సరికాదు. పత్రికా స్వేచ్ఛను కూటమిప్రభుత్వం కాపాడాలి. ఇలాంటి దాడుదు సరికాదు. ప్రజలే బుద్ధిచెబుతారు.
– లతిఫ్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ)
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తోంది. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటికై నా పత్రికలపై కక్ష మానుకుని రాష్ట్ర అభివృద్ధివైపు అడుగువేయాలని సూచిస్తున్నాం.
– జి.జగన్నాథం, జేఏసీ కన్వీనర్, కామారెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి దినపత్రిక, చానల్‌పై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. చంద్రబాబు నాయుడు పత్రికా స్వేచ్ఛపై పాల్పడుతున్న కక్ష్య సాధింపు చర్యల్లో కేంద్ర ప్రభుత్వం హస్తం కూడా ఉందని భావిస్తున్నాం. ప్రజా సమస్యలను, అవినీతి, అక్రమాలు బయటపెడుతున్నందుకు కక్ష సాధించడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.
– చంద్రశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి
ప్రజల పక్షాన నిలిచే మీడియానే గౌరవించని ప్రభుత్వం ప్రజలను ఏం కాపాడుతుంది. ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, పోలీసులతో సాక్షి కార్యాలయాలపై భౌతిక దాడులు చేయించడం, అక్రమ కేసులు బనాయిచడం పిరికిపంద చర్య. ప్రజలే బుద్ధి చెబుతారు.
– ఎల్‌ఎన్.ఆజాద్, బీడీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం పూర్తిగా చట్టాలను, న్యాయాన్ని గౌరవిచండం లేదు. కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే సాక్షి దినపత్రిక, చానల్‌పై, కార్యాలయాలపై తరుచూ దాడులు చేయిస్తోంది. టీడీపీ కార్యకర్తలతో దాడులు చేయించడం చూసి చలించిపోయాం. ఇది ముమ్మాటికీ వ్యక్తిగత దాడిగా భావిస్తున్నాం.
– క్యాతం సిద్దిరాములు, బహుజన
ఐక్యవేదిక జిల్లా కన్వీనర్, న్యాయవాది

కలం గొంతు నొక్కడమే..

కలం గొంతు నొక్కడమే..

కలం గొంతు నొక్కడమే..

కలం గొంతు నొక్కడమే..

కలం గొంతు నొక్కడమే..

కలం గొంతు నొక్కడమే..