
అటవీ అమరవీరులకు నివాళులు
కామారెడ్డి క్రైం: జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. డీఎఫ్‌వో నిఖిత, అధికారులు అటవీ అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులను స్మరిస్తూ అధికారులు, సిబ్బంది రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎఫ్‌వో మాట్లాడుతూ.. విధుల్లో ఎదురయ్యే సవాళ్లకు భయపడొద్దని, సమష్టిగా ఎదుర్కోవాలని సూచించారు.
ప్రతి అధికారికి అండగా ఉంటామన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో అటవీశాఖ అధికారులు చేపట్టిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవోలు రామకృష్ణ, సునీత, ఎఫ్‌ఆర్వోలు హబీబ్, రమేశ్, వాసుదేవ్, చరణ్ తేజ, హేమ చందన, రవికుమార్, సంతో్‌ష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.